సీడీపీవో పోస్టుల భర్తీలో వింత వైఖరి..! | cdpo notification out | Sakshi
Sakshi News home page

సీడీపీవో పోస్టుల భర్తీలో వింత వైఖరి..!

Dec 18 2017 2:41 AM | Updated on Dec 18 2017 2:41 AM

cdpo notification out - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో కీలకమైన చైల్డ్‌ డెవలప్‌మెం ట్‌ ఆఫీసర్‌ (సీడీపీవో) పోస్టుల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం వింతవైఖరి ప్రదర్శిస్తోంది. ఈ పోస్టులకు కేవలం మహిళా అభ్యర్థులు మా త్రమే అర్హులని పేర్కొంటూ ఇటీవల నోటిఫి కేషన్‌ జారీ చేసింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీ కరణ ప్రక్రియ ముగియగా.. వచ్చే నెలలో అ ర్హత పరీక్ష సైతం నిర్వహించబోతోంది.

వాస్త వానికి సీడీపీవో పోస్టుకు మహిళలు, పురుషు లు ఇద్దరూ అర్హులని కేంద్ర ప్రభుత్వ నిబంధ నల్లో ఉంది. ఈ మేరకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సైతం స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలో సీడీపీవో పదోన్నతుల్లో పురుషుల కు సైతం అవకాశం కల్పించినప్పటికీ... కొత్త గా నియామక ప్రక్రియలో మాత్రం మహిళల కే అవకాశం ఇవ్వడంపై నిరుద్యోగ సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో సంబంధి త మంత్రితో పాటు ఆ శాఖ సంచాలకుడు, కార్యదర్శికి వినతులు వెల్లువెత్తాయి.

అర్హులే కానీ...
శిశు అభివృద్ధి అధికారి పోస్టులకు పురుషులు సైతం అర్హులేనని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ శాఖ సంచాలకుడు రాష్ట్ర ప్రభుత్వానికి నివేది క అందజేశారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనా డు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్ర ప్రభు త్వాల నుంచి వివరాలు సేకరించినట్లు పే ర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ శాఖ లేఖ సమర్పించింది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో కేవలం మహిళలతోనే ఈ పోస్టులు భర్తీ చేయాలన్న నిర్ణయంతో ఈ మేరకు నిర్ణ యించినట్లు తెలుస్తోంది.

కానీ పదోన్నతుల్లో మాత్రం ఈ నిబంధనను పరిగణించకపోవ డం గమనార్హం. తాజాగా 69 సీడీపీవోల భర్తీ కి టీఎస్‌పీఎస్సీ చర్యలు వేగిరం చేసింది. ఇందులో భాగంగా వచ్చేనెల మొదటివారం లో అర్హత పరీక్ష నిర్వహించనుంది. ఈ నేప థ్యంలో నిరుద్యోగ సంఘాలు మహిళాభివృ ద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ప్రభుత్వ కార్యదర్శికి సైతం వినతులు అందించారు. వారు సాను కూలంగా స్పందించినప్పటికీ చర్యలు తీసు కోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు అర్హత పరీక్ష గడువు సమీపిస్తోంది. ఆలోపు నిర్ణయం తీసుకోకుంటే పురుష అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంది.


న్యాయ పోరుకు సిద్ధం
సీడీపీవో పోస్టుకు దరఖాస్తు చేసుకో వాలంటే ఎంఎస్‌డబ్ల్యూ కోర్సు పూర్తి చేయా లి. ఈ కోర్సు చదివితే ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగం ఉండే ఏకైక పోస్టు ఇదే. కానీ మ హిళా అభ్యర్థులే అర్హులని చెబితే ఈ కోర్సు చేసిన పురుషులు ఏమైపోవాలి. లేకుంటే ఈ కోర్సును సైతం మహిళలకే పరిమితం చే యాలి. పదోన్నతుల సమయంలో పురుషు లకు అవకాశం ఇచ్చినప్పుడు.. నియామకా ల్లో ఎందుకు ఇవ్వరు. ప్రభుత్వం స్పందించ కుంటే న్యాయ పోరాటానికి సైతం వెనుకాడం.    – ప్రేమ్‌కుమార్, నిరుద్యోగి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement