కారు బోల్తా.. పది పల్టీలు | car rolls and ten drives | Sakshi
Sakshi News home page

కారు బోల్తా.. పది పల్టీలు

Apr 12 2015 1:55 PM | Updated on Sep 3 2017 12:13 AM

మెదక్ జిల్లా ములుగు సమీపంలో ఆదివారం ఉదయం ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది.

మెదక్: మెదక్ జిల్లా ములుగు సమీపంలో ఆదివారం ఉదయం ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. ఆ తర్వాత పది పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు గాయపడ్డారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కారులో కల్లు సీసాలు బయటపడ్డాయి. దీన్ని బట్టి కారులోని యువకులు మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement