ఎండకు టోపీ పెట్టేద్దాం..

Caps Business in Summer Season  - Sakshi

టూర్‌లో క్యాప్‌లు తప్పనిసరి

ఎండతో ఉపశమనంతో పాటు స్టైయిలిష్‌గా  

పిల్లలు పెద్దలకు టోపీలు, మహిళలకు స్కార్ఫ్‌లు

నగరంలో ఊపందుకున్న టోపీల వ్యాపారం

సాక్షి సిటీబ్యూరో: ఎండాకాలంలో టూర్‌కు వెళుతున్నారా..?అయితే పలు జాగ్రత్తలు తీసుకొవాల్సిందే.. ఎందుకంటే నగరంలో ఎండలు మండిపోతున్నాయి.  ఎండా కాలానికి.. పర్యాటకానికి అవినాభావ సంబంధం ఉంది. పిల్లలకు వేసవి సెలవులు రావడంతో పర్యటనలు మొదలవుతాయి. పుస్తకాలతో కుస్తీ పట్టిన చిన్నారులకు వేసవి సెలవులు ఎంతో ఊరట. అందుకే తల్లిదండ్రులు వేసవి సెలవులు వస్తున్నాయంటే.. ముందుగానే ప్రణాళికలు వేసుకుని పర్యటనలకు సిద్ధమవుతారు. ఇలా వెళ్తున్నవారు కాస్తా ఆలోచించకుండా.. మొండిగా వెళ్లిపోతే.. ఎవరికో ఒకరికి వడదెబ్బ తగలడం.. వారితో మిగతా వారంతా సతమతం కావడం జరుగుతుంది. ఎండ వేడిమి నుంచి తట్టుకోవడానికి నగర ప్రజలు రకరకాల ఉపశమన మర్గాలను ఎంచుకుంటారు. పిల్లల నుంచి పెద్దలు, యువతులు  భానుడి కిరణాల భారి నుంచి రక్షించుకునేందుకు టోపీలను ధరించాల్సిందే. పిల్లలు మగవారు టోపీలు ధరిస్తే మహిళలకు మార్కెట్‌లో స్కార్ఫ్‌లు అందుబాటులో ఉన్నాయి. 

దేశీయ, విదేశీ డిజైన్లు..
నగరంలో దేశీయ టోపీలతో పాటు విదేశీ డిజైన్‌లతో టోపీలు అందుబాటులో ఉన్నాయి. ఇండోనేషియా, చైనా, బంగ్లాదేశ్‌తో పాటు కోలకత, ముంబైతో పాటు ఢిల్లీ నుంచి కూడా దేశీయ విదేశీ బ్రాండ్‌ టోపీలు నగరానికి దిగుమతి అవుతున్నాయి. విదేశీ డిజైన్ల టోపీలతో ఒకవైపు ఎండ నుంచి రక్షణ పొందుతూనే మరోవైపు స్టైయిలిష్‌గా కనబడవచ్చు. నగరంలోనూ టోలిచౌకి, మదీనా సర్కిల్‌లోని మహ్మద్‌ క్యాప్‌ మార్ట్‌ నిర్వహకులు ఇల్యాస్‌ బుకారీ అన్ని వయసుల వారికి అనువైన టోపీలను తయారు చేస్తున్నారు.  

వెరైటీ టోపీలు
వందల సంఖ్యలో వివిధ రకాల టోపీలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. స్పోర్ట్స్‌ క్యాప్స్, గోల్ఫ్, కౌబాయి, రెబాక్, హిప్పొ, కాటన్, నైలాన్, కిట్‌క్యాట్‌లతో పాటు తోలుతో తయారు చేసిన వివిధ రకాల సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ప్రస్తుతం మహిళలు, అమ్మాయిలు  వినియోగిస్తున్న స్కార్ఫ్‌లను కూడా నూతన డిజైన్‌లలో తయారు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top