ఆదాయ పన్నుల బకాయిల రద్దు ఉత్తిదే | Cancellation of Income Tax Dues fake | Sakshi
Sakshi News home page

ఆదాయ పన్నుల బకాయిల రద్దు ఉత్తిదే

May 31 2018 1:17 AM | Updated on May 31 2018 1:17 AM

Cancellation of Income Tax Dues fake - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ఆదాయపు పన్ను విభాగం ప్రధాన ముఖ్య కమిషనర్‌ కార్యాలయం 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాలకు చెందిన రూ.3,002.20 కోట్ల ఆదాయ పన్నుల బకాయిలను రద్దు చేసినట్లు కొన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తా కథనాల్లో వాస్తవం లేదని ఆ శాఖ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ కార్యాలయం పేర్కొంది.

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం బకాయిలను రద్దు చేయడంతో పాటు రద్దు చేసేందుకు ప్రకటించడం క్లిష్టమైన ప్రక్రియ అని, దీనికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి(సీబీడీటీ) ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం కింద రూ.3,002.20 కోట్ల పన్నులు రద్దు చేసినట్లు వెల్లడిస్తూ తమ కార్యాలయం పొరపాటుగా సమాధానమిచ్చిందని బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ విషయంలో హైదరాబాద్‌ ఆదాయపు పన్ను విభాగం బేషరతు క్షమాపణను కోరుతున్నట్లు పేర్కొంది. కేవలం ఏమరుపాటుతోనే అసంబద్ధమైన సంఖ్యను ఆర్‌టీఐకి వచ్చిన ఓ ప్రశ్నకు జవాబుగా ఇచ్చామని ఆదాయపు పన్ను హైదరాబాద్‌ విభాగం స్పష్టీకరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement