
బ్రెయిలీ లిపిలో ముద్రించిన ఓటరు ఐడీ కార్డ్ ఓటరు ఐడీ కార్డును చదువుతున్న ప్రెస్ ఎడిటర్ వెంకటేశ్వర రావు
మలక్‌పేట బ్రెయిలీ ప్రెస్‌లో దేశంలోనే మొదటిసారిగా అంధుల కోసం ప్రత్యేక ఓటరు కార్డులు ముద్రించారు. అలాగే అంధులు గుర్తించేలా ప్రత్యేక బ్యాలెట్‌ను కూడా ఇక్కడ రూపొందిస్తున్నారు.
చాదర్‌ఘాట్: దేశ చరిత్రలోనే మలక్‌పేట బ్రెయిలీ ప్రెస్ ప్రభుత్వ కార్యాలయం గుర్తింపు సాధించిందని బ్రెయిలీ ప్రెస్ ఎడిటర్ జి.వెంకటేశ్వరరావు (అంధుడు) తెలిపారు. బుధవారం మలక్‌పేటలోని కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. దేశంలో ఇప్పటివరకు ఎక్కడాలేని విధంగా అంధుల కోసం ప్రత్యేకంగా ఓటరు ఐడీ కార్డు ముద్రించలేదన్నారు. ప్రస్తుతం మలక్‌పేట బ్రెయిలీ ప్రెస్ ఉద్యోగులు ముద్రించినట్లు చెప్పారు. నగర పర్యటనలో భాగంగా భారత ఎన్నికల ప్రధానాధికారి రావత్ బ్రెయిలీ ఓటర్ ఐడీ కార్డును అభినందించారన్నారు. అంధులు ఎవరికి ఓటు వేయాలో గుర్తించేలా బ్యాలెట్ పేపర్‌ను తయారు చేస్తున్నట్లు రావత్‌కు వివరించినట్లు ఆయన తెలిపారు. డిసెంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో బ్రెయిలీ లిపిలో తయారు చేసిన సుమారు 50 వేల ఓటరు ఐడీ కార్డులను ముద్రించినట్లు వెంకటేశ్వరరావు చెప్పారు.