ప్రేమ పేరుతో మోసం.. 

Boyfriend Cheated Love Protest Warangal - Sakshi

కాళేశ్వరం: మూడు సంవత్సరాలుగా ఒకరికొకరు ప్రేమించుకున్నారు. చివరకు పెళ్లి చేసుకుంటానని ప్రియుడు ప్రియురాలిని మోసం చేసి ఊరు వదిలి పరారయ్యాడు. దీంతో గత్యంతరం లేక తనకు న్యాయం చేయాలని కోరుతూ  ప్రియుడి ఇంటి ముందు  వారం రోజులుగా ప్రియురాలు ఆందోళనకు దిగింది. ఈ ఘటన మండలంలోని  కాళేశ్వరంలో ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. కాటారం మండలం నస్తూర్‌పల్లి గ్రామానికి చెందిన మేర్జాన సంధ్య, మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం ఎస్సీ కాలనీకి చెందిన చకినారపు రాజశేఖర్‌ ప్రేమించుకున్నారు. రాజశేఖర్‌ డిగ్రీ వరకు చదివి ఖాళీగా ఉన్నాడు.

సంధ్య కాళేశ్వరంలోని అమ్మమ్మ సమ్మక్క ఇంటి వద్ద ఉంటూ తాపీమేస్త్రీ వద్ద రోజు వారి కూలీ పని చేస్తుండేది. దీంతో వీరిద్దరి మధ్య పరిచయం పెరిగి అది కాస్తా ప్రేమగా మారింది. మూడు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని రాజశేఖర్‌పై సంధ్య ఒత్తిడి తెచ్చింది. పెళ్లికి నిరాకరించిన ఆ యువకుడు ఇంటికి తాళం పెట్టి కుటుంబ సభ్యులతో కలసి ఊరు వదిలి వెళ్లాడు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు బైఠాయించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె నుంచి వివరాలు సేకరించారు. ఈ విషయంపై శ్రీనివాస్‌ను వివరణ కోరగా సంధ్యకు కౌన్సిలింగ్‌ ఇచ్చి తల్లిదండ్రులను తీసుకురావాలని పంపినట్లు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top