నగరంలోని రామాంతపూర్ పరిధి, గోఖలే నగర్‌లో బుధవారం విషాదం చోటు చేసుకుంది.
కరెంటు షాక్‌తో బాలుడి మృతి
Jan 13 2016 11:11 AM | Updated on Jul 12 2019 3:02 PM
హైదరాబాద్: నగరంలోని రామాంతపూర్ పరిధి, గోఖలే నగర్‌లో బుధవారం విషాదం చోటు చేసుకుంది. ఇంటిపైన గాలి పటాన్ని ఎగరేస్తుండగా పక్కనున్న చెట్లలో గాలిపటం ఇరక్కపోయింది. గాలిపటాన్ని తీసే క్రమంలో ప్రమాదవశాత్తూ కరెంటు తీగలకు తగిలి రవి కుమార్(10) అనే బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement