అనాథ యువతిని ప్రేమించి జీవితాంతం తోడుగా ఉంటానని నమ్మించి ఆశ్రయం కల్పించాడు.
సహజీవనం చేసిన యువతితో యువకుడి మేనమామ
అమీర్‌పేటః
అనాథ యువతిని ప్రేమించి జీవితాంతం తోడుగా ఉంటానని నమ్మించి ఆశ్రయం కల్పించాడు. మూడు సంవత్సరాలుగా ఆమెతో సహజీవనం చేసి వదిలేసి వెల్లాడు. తమ వాడిని మూడు సంవత్సరాలుగా వాడుకున్నందుకు మూడు లక్షల నష్ట పరిహరం చెల్లించాలని యువకుడి మేనమామ బెదిరింపులకు పాల్పడటంతో బాధితురాలు ఎస్‌ఆర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ బొధన్ మండలం సత్తనపల్లికి చెందిన అనాథ యువతి శ్రీనగర్ కాలనీలోని ఓ బట్టల షాపులో పనిచేస్తుంది.
షాపుకు ఎదురుగా బేకరీషాపులో పనిచేసే రాజేష్ సదరు యువతి మద్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉంటానని మాయమాటలు చెప్పి సహజీవనం కొనసాగించాడు. ఇద్దరు కలిసి ఎస్‌ఆర్‌నగర్‌లోని శ్రీ వేంకటేశ్వర దేవాలయం సమీపంలో ఓ ఇంట్లో ఉంటూ మూడు సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు.
ఇటీవల రాజేష్‌లో మార్పు వచ్చి యువతి ఎవరితో మాట్లాడినా అనుమానంతో చేయి చేసుకుంటుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సర్ధిచెప్పగా పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్లిపోయాడు. యువకుడి మేనమామ ఇంటికి వచ్చి ఇంట్లోని సామాగ్రిని అంతా తీసుకుని పోయాడు. దీనిపై యువతి అతడిని నిలదీయగా తమవాడిని వాడుకున్నందుకు మూడు లక్షల నష్ట పరిహరం చెల్లించాలని బెదిరించడంతో పోలీసుకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.యువకుడి మేనమామ పోలీసుల విభాగంలో పనిచేస్తున్నట్లు తెలిసింది.