బూత్ బంగ్లాలా ఆర్ అండ్ బీ కార్యాలయం | Booth Bungalow R&B office | Sakshi
Sakshi News home page

బూత్ బంగ్లాలా ఆర్ అండ్ బీ కార్యాలయం

Dec 21 2014 1:58 AM | Updated on Sep 2 2017 6:29 PM

బూత్ బంగ్లాలా ఆర్ అండ్ బీ కార్యాలయం

బూత్ బంగ్లాలా ఆర్ అండ్ బీ కార్యాలయం

పట్టణంలోని ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్ కార్యాలయం బూత్ బంగళాలాను తలపిస్తోంది.

పటాన్‌చెరు : పట్టణంలోని ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్ కార్యాలయం బూత్ బంగళాలాను తలపిస్తోంది. దయ్యాల సినిమాల్లో కనిపించే విధంగా ఆ బంగళా చూసి స్థానికులు భయం తో వణికి పోతున్నారు. స్థానికుల సంగతి పక్క న పెడితే జేఈ రాజశేఖర్ కూడా అందులో కూర్చునేందుకు జంకుతున్నారు. ఇదే విషయమై ఆయన వివరణ కోరగా తన కార్యాలయంలో తనతో పాటు వర్క్ ఇన్‌స్పెక్టర్ మా త్రమే ఉంటారని తామిద్దరం నేరుగా సైట్ల వద్దకు వెళ్లి పనులను పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు.

ఈ కారణంగా తాము కార్యాలయానికి రాలేక పో తున్నామన్నారు. నిజాం కాలం నాటి బంగళాలో పాము లు, ఇతర కీట కాలు ఉన్నాయని, విద్యుత్ సరఫరా కూడా లేదని వివరించా రు. దీంతో చేసేది లేక కార్యాలయానికి సంబంధించిన ఫైళ్లు, రికార్డులు ఎప్పుడు తన వద్దే ఉంచుకుంటున్నట్లు ఏఈ తెలిపారు. సంగారెడ్డిలోని ఆర్‌అండ్‌బీ సబ్‌డివిజన్ కార్యాలయంలో పాత రికార్డులను భద్రం చేస్తున్నామన్నారు. ఇతర కార్యకలాపాలు కూడా అక్కడి నుంచి కొనసాగిస్తున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement