తప్పిన పెను ప్రమాదం.. నాలుగు కార్లు ధ్వంసం

Big Neem Tree Fell Down On Four Cars In Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమీపంలో ఒక భారీ వృక్షం నేలకొరిగిన సంఘటనలో పెను ప్రమాదం తప్పింది. తెల్లవారు జామున ఈ ఘటన జరగటంతో ప్రాణనష్టం వాటిల్లలేదు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీ వేప వృక్షం నేలకొరిగి పార్కింగ్‌ చేసిన కార్లపై పడటంతో నాలుగు కార్లు ధ్వంసం అయ్యాయి. ధ్వంసమైన వాటిలో ఒకటి ఆడి కార్‌ కాగా రెండు హోండా సిటీ, ఒక సాంత్రో కారు ఉన్నాయి. వేప చెట్టుకు వందేళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top