వచ్చే నెలలో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. మే 16న ఉప ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషన్ అధికారులు నిర్ణయించారు.
హైదరాబాద్: వచ్చే నెలలో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. మే 16న ఉప ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషన్ అధికారులు నిర్ణయించారు. అదే నెల 19న ఓట్ల లెక్కింపు చేయనున్నారు.
కాంగ్రెస్ పార్టీ నేత రాంరెడ్డి వెంకట్ రెడ్డి మృతి చెందిన నేపథ్యంలో పాలేరులో ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల కోసం ఈ నెల 22న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్లు 29వరకు స్వీకరిస్తారు. వీటి పరిశీలన ఈ నెల30 వరకు ఉండనుంది. మే 2ని నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉండనుంది.