గజ్వేల్లో సీఎం హెలీప్యాడ్ వద్ద తేనెటీగల దాడి | Bees attacked at Gajwal CM Helepad | Sakshi
Sakshi News home page

గజ్వేల్లో సీఎం హెలీప్యాడ్ వద్ద తేనెటీగల దాడి

Mar 12 2015 4:37 PM | Updated on Sep 2 2017 10:43 PM

గజ్వేల్లో సీఎం హెలీప్యాడ్ వద్ద తేనెటీగల దాడి

గజ్వేల్లో సీఎం హెలీప్యాడ్ వద్ద తేనెటీగల దాడి

మెదక్ జిల్లాలోని గజ్వేల్లో సీఎం హెలీప్యాడ్ ప్రాంగణం వద్ద గురువారం తేనెటీగలు దాడిచేశాయి.

గజ్వేల్: మెదక్ జిల్లాలోని గజ్వేల్లో సీఎం హెలీప్యాడ్ ప్రాంగణం వద్ద గురువారం తేనెటీగలు దాడిచేశాయి. ఈ తేనెటీగల దాడిలో ఆ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జాతో సహా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పోలీసులకు గాయాలుయినట్టు తెలిసింది. గజ్వేల్ నియోజకవర్గంలో గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత నియోజకవర్గంలో పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడి సీఎం హెలీప్యాడ్ వద్ద అధికారులంతా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో అధికారులంతా హెలీప్యాడ్ వద్ద సీఎం రాక కోసం ఎదురుచూస్తున్న సమయంలో తేనెటీగలు దాడి చేసినట్టు తెలుస్తోంది.

దాంతో అధికారులు, ప్రజాప్రతినిధులంతా పరుగులు పెట్టారు. తేనెటీగల బారినుంచి తప్పుంచుకునేందుకు ప్రయత్నాల్లో గోనె సంచుల్లోనూ, కూర్చీలను అడ్డుపెట్టుకున్నారు. తేనెటీగల దాడితో అధికారులంతా సీఎం హెలీప్యాడ్ ప్రాంగణాన్ని వదిలివెళ్లారు.  ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement