బీసీల డిమాండ్లు కేంద్రానికి వివరిస్తా | BC reservation increment focus central government : Union Minister Dattatreya | Sakshi
Sakshi News home page

బీసీల డిమాండ్లు కేంద్రానికి వివరిస్తా

Jul 31 2017 3:34 AM | Updated on Sep 5 2017 5:13 PM

బీసీల రిజర్వేషన్ల పెంపు అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు.

కేంద్ర మంత్రి దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్‌: బీసీల రిజర్వేషన్ల పెంపు అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు. రిజర్వేషన్ల పెంపు, ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు, బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు తదిత ర అంశాలపై ఆదివారం ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంక్షేమ సంఘ నేతలు దత్తాత్రేయను కలిశారు. ఈ సందర్భంగా జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని వారు కోరారు. అనంతరం ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. ఆగస్టు 5న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రిజర్వేషన్ల పెంపుతో పాటు బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటుపై ఢిల్లీలో అన్ని పార్టీల అధినేతలను కలసి మద్దతు కోరతామ న్నారు. ఇందుకు బీసీ సంక్షేమ సంఘం నేతలతో కోర్‌ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement