'నెల రోజుల్లో బీసీ కమిషన్ ఏర్పాటు' | bc commission within one month | Sakshi
Sakshi News home page

'నెల రోజుల్లో బీసీ కమిషన్ ఏర్పాటు'

Mar 24 2015 1:15 AM | Updated on Sep 2 2017 11:16 PM

'నెల రోజుల్లో బీసీ కమిషన్ ఏర్పాటు'

'నెల రోజుల్లో బీసీ కమిషన్ ఏర్పాటు'

వెనుకబడిన తరగతుల (బీసీ) జాబితాలో ఏయే కులాలను చేర్చాలి, వేటిని తొలగించాలన్న విషయంలో ఓ నిర్ణయం తీసుకోవడానికి నెల రోజుల్లో బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి జోగు రామన్న చెప్పారు.

 సాక్షి, హైదరాబాద్ : వెనుకబడిన తరగతుల (బీసీ) జాబితాలో ఏయే కులాలను చేర్చాలి, వేటిని తొలగించాలన్న విషయంలో ఓ నిర్ణయం తీసుకోవడానికి నెల రోజుల్లో బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి జోగు రామన్న చెప్పారు. అసెంబ్లీలో  సోమవారం తన చాంబర్‌కు వచ్చిన విలేకరులతో మంత్రి మాట్లాడారు. బీసీ ఉప ప్రణాళిక వల్ల న ష్టం జరుగుతుందని అధికారులు సూచిస్తున్నారని ఆయన తెలిపారు. వాస్తవానికి బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం ఏ పద్దు కింద ఎంతెంత ఖర్చు పెడుతున్నారో పద్దుల వారీగా లెక్కలు తీయిస్తున్నామని చెప్పారు. ఆ వివరాలు అందాక, ఉప ప్రణాళిక అయితే బావుంటుందా, లేదా ప్రస్తుత పద్ధతిలోనే ఖర్చు పెట్టాలా అన్న విషయంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బీసీల్లో కులాల చేరికలు, తొలగింపులకు కమిషన్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం జరిగిందని, నెల రోజుల్లో ఆ ప్రకటన వెలువడవచ్చని వివరించారు. ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయడానికి కృషి చేస్తోందని, వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలవర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయనుండడం వల్ల బీసీలకు ఎక్కువ అవకాశాలు దక్కుతాయని మంత్రి జోగు రామన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement