
పెరిగిన జీతాలు చెల్లించలేదని బాసర ట్రిపుల్ ఐటీ ఎదుట సెక్యూరిటీ సిబ్బంది మంగళవారం ఆందోళనకు దిగారు.
సాక్షి, బాసర : పెరిగిన జీతాలు చెల్లించలేదని బాసర ట్రిపుల్ ఐటీ ఎదుట సెక్యూరిటీ సిబ్బంది మంగళవారం ఆందోళనకు దిగారు. గతేడాది (2018) జూలై నెలలో జీతాలు పెరగగా మే 2019 వరకు వాటిని చెల్లించలేదని సెక్యురిటీ సిబ్బంది ఆరోపించారు. క్యాంపస్‌లో సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న 180 మంది పెరిగిన జీతాల బకాయిలు వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు. దాదాపుగా 10 నెలలు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున మొత్తం 29 లక్షలు చెల్లించాలని తెలిపారు. బకాయిల చెల్లింపు కోసం గతంలో పలుమార్లు వినతి పత్రాలు అందించిన లాభం లేకపోవటంతోనే ఇవాళ గేటు ఎదుట భైటాయించామని తెలిపారు.
(చదవండి : బాసర ట్రిపుల్ ఐటీలో అసాంఘిక కార్యకలాపాలు)