మెట్రో రైళ్లలో సెక్యూరిటీ గార్డులుగా ట్రాన్స్‌జెండర్ల నియామకం | Hyderabad Metro Hires 20 Transgender Security Guards to Empower and Promote Equality | Sakshi
Sakshi News home page

మెట్రో రైళ్లలో సెక్యూరిటీ గార్డులుగా ట్రాన్స్‌జెండర్ల నియామకం

Sep 16 2025 6:53 PM | Updated on Sep 16 2025 7:14 PM

Transgenders Appointed As Security Guards In Hyderabad Metro Trains

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని మెట్రో రైళ్లలో 20 మంది ట్రాన్స్‌జెండర్లను సెక్యూరిటీ గార్డులుగా ప్రభుత్వం నియమించింది. మెట్రో రైల్ లిమిటెడ్ సెక్యూరిటీ గార్డులుగా వారికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ నియామక పత్రాలు అందించారు. సెక్యూరిటీ గార్డు నియామకాల కోసం దాదాపు 300 మంది దరఖాస్తు చేసుకోగా, నైపుణ్యం కలిగిన వారిని ప్రభుత్వం ఎంపిక చేసింది.

ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్ల అభ్యున్నతి, వారు ఆత్మగౌరంతో జీవించాలన్నదే సీఎం సంకల్పమన్నారు. ట్రాన్స్‌జెండర్లు సమాజంలో గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో ఈ అవకాశం కల్పించామన్నారు. కష్టపడి పనిచేస్తే మీకే కాకుండా, ఇతర ట్రాన్స్‌జెండర్లకు కూడా మంచి భవిష్యత్తు ఏర్పడుతుందన్నారు. ట్రాన్స్‌జెండర్లు.. ఈ సమాజానికి ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకోవాలి. ట్రాన్స్‌జెండర్‌లకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి కచ్చితంగా అమలు చేస్తారు’’ అని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement