బ్యాంక్ మేనేజర్‌నంటూ ఘరానా మోసం | Bank manager nantu Gharana fraud | Sakshi
Sakshi News home page

బ్యాంక్ మేనేజర్‌నంటూ ఘరానా మోసం

Mar 17 2016 2:25 AM | Updated on Apr 3 2019 8:07 PM

తాను బ్యాంక్ మేనేజర్‌ను మాట్లాడుతున్నానంటూ ఏటీఎం పిన్ నంబర్ తెలుసుకొని అకౌంట్‌లో ఉన్న రూ.10 వేలు డ్రా

మంగపేట : తాను బ్యాంక్ మేనేజర్‌ను మాట్లాడుతున్నానంటూ ఏటీఎం పిన్ నంబర్ తెలుసుకొని అకౌంట్‌లో ఉన్న రూ.10 వేలు డ్రా చేసుకుని ఘరానా మోసానికి పాల్పడిన సంఘటన గురువారం రాత్రి వెలుగు చూసింది. బాధితుడి కథనం ప్రకారం.. మండలంలోని బాలన్నగూడెం పంచాయతీ పరిధిలోని నీలాద్రిపేటకు చెందిన జాడి రవి సెల్‌ఫోన్‌కు మంగళవారం రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో 8298328147 నంబర్ నుంచి 9 సార్లు ఫోన్ వచ్చింది. చివరిసారి ఫోన్ లిఫ్ట్ చేయగా తాను బ్యాంక్ మేనేజర్‌నని, మీ బ్రాంచ్ ఏటీఎం, ఆధార్, పాన్‌కార్డు నంబర్లు ఇవ్వమని అడిగాడు. ఎందుకని రవి ప్రశ్నిం చగా మీ పిన్ మార్చుతున్నామని చెప్పడంతో తన పిన్ నంబర్ చెప్పాడు.

పిన్ నంబర్ చెప్పిన వెంటనే తన బ్యాంక్ ఆకౌంట్, తన పూర్తి వివరాలను వెల్లడించాడు. ఫోన్ కట్ కాగానే తన ఏటీఎం ద్వారా రూ.10 వేలు డ్రా చేసినట్లు రవి ఫోన్‌కు మెసేజ్ వచ్చిది. వెంటనే అతడు మంగపేటకు వచ్చి అసలు ఏమి జరిగిందని తెలుసుకునేసరికి ఎవరో అపరిచిత వ్యక్తి ఏటీఎం పిన్‌నంబర్ తెలుసుకుని మీ అకౌంట్లో ఉన్న రూ.10 వేల నగదును డ్రా చేశారని సిబ్బంది వివరించారు. జరిగిన విషయంపై విచారణ జరిపి ఘరానా మోసానికి పాల్పడిన వ్యక్తిని పట్టుకుని తనకు న్యాయం చేయాలని కోరుతూ స్థానిక పోలీసులకు బుధవారం ఉదయం పిర్యాదు చేసినట్లు బాధితుడు వివరించాడు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement