బీఫార్మసీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం | B pharmacy student attempt to suicide in Nalgonda | Sakshi
Sakshi News home page

బీఫార్మసీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

Nov 19 2014 1:21 PM | Updated on Sep 2 2017 4:45 PM

జిల్లాలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీఫార్మసీ చదువుతున్న ఓ విద్యార్థి బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

నల్గొండ: జిల్లాలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీఫార్మసీ చదువుతున్న ఓ విద్యార్థి బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హెచ్ వోడీ వేధింపులు తాళలేక అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. గత కొన్నిరోజులుగా హెచ్వోడీ తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ  కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు.

అయినా కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదు. దాంతో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. గమనించిన తోటి విద్యార్థులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement