కొత్తగూడెంలో ఆర్మీరిక్రూట్ మెంట్లు | army recruitments in kottagudem | Sakshi
Sakshi News home page

కొత్తగూడెంలో ఆర్మీరిక్రూట్ మెంట్లు

Feb 3 2015 8:24 PM | Updated on Sep 2 2017 8:44 PM

ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో బుధవారం నుంచి తొమ్మిది రోజుల పాటు జరుగనున్న ఆర్మీ రిక్రూట్ మెంట్లకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

కొత్తగూడెం : ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో బుధవారం నుంచి తొమ్మిది రోజుల పాటు జరుగనున్న ఆర్మీ రిక్రూట్ మెంట్లకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం ఏడు కేటగిరీల్లో జరుగనున్నఈ రిక్రూట్ మెంట్లకు తెలంగాణలోని 10 జిల్లాల అభ్యర్థులు హాజరు కానున్నారు. ఇప్పటికే పలువురు అభ్యర్థులు కొత్తగూడెం చేరుకున్నారు. అధికారులు వారికి భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. అభ్యర్థుల ఎత్తు, బరువు, ఛాతి కొలతలను స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, ఇతర పరీక్షలు ప్రకాశం స్టేడియంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ రిక్రూట్‌మెంట్లకు రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల మంది అభ్యర్థులు హాజరయ్యే అవకాశాలున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement