మహబూబ్‌నగర్ టౌన్: ఆహారభద్రత, పింఛన్లకు వచ్చిన దరఖాస్తులపై విచారణ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జీడి ప్రియదర్శిని అధికారులను ఆదేశించారు.
మహబూబ్‌నగర్ టౌన్: ఆహారభద్రత, పింఛన్లకు వచ్చిన దరఖాస్తులపై విచారణ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జీడి ప్రియదర్శిని అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, వచ్చిన ప్రతి దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించి, సమగ్ర సమాచారంతో విచారణకు వెళ్లాలన్నారు.
దరఖాస్తు చేసుకొన్న వారు చెప్పే సమాచారాన్ని సమగ్ర సమాచారంతో తనిఖీ చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 15తో గడువు ముగియనున్నందున, 16నుంచి ఇంటింటి తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టాల్సినందున విచారణ బృందం అందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇందుకు సంబంధించి మండలానికో బృందాన్ని నియమించామని వారికి బుధవారం ఆర్డీఓలు నియామక ఉత్తర్వులను అందజేయూలన్నారు.
నిబంధనల ప్రకారమే
లబ్ధిదారుల ఎంపిక
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అర్హులను ఎంపిక చేయూలన్నారు. ఈవిషయంలో ఎవ్వరైనా నిబంధనలను పక్కన పెట్టి అనర్హులను ఎంపికచేసినట్లు బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రుణాల అందజేత కార్యక్రమాన్ని వేగవంతం చేసి రెండురోజుల్లో లక్ష్యాన్ని అధిగమించాల్సిందిగా సూచించారు. కార్యక్రమంలో జేసి ఎల్.శర్మన్, ఏజేసి రాజారాం, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జాగ్రత్తగా సేకరించాలి
క్లాక్‌టవర్ (మహబూబ్‌నగర్): ఆహారభద్రత, పింఛన్లకు వచ్చే ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా సేకరించాలని జిల్లా కలెక్టర్ జీడి ప్రియదర్శిని సిబ్బందికి సూచించారు. మంగళవారం స్థానిక మోనప్పగుట్ట, మోడల్ బేసిక్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటర్లను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి వార్డులో ఏర్పాటు చేసిన కౌంటర్లకు వచ్చే వారందరి నుంచి దరఖాస్తులు స్వీకరిం చి, రికార్డులో నమోదు చెయ్యాలన్నారు. ఏ దరఖాస్తు మిస్‌కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు.
సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అం దించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. కౌంటర్లలో లబ్దిదారులు ఎక్కువగా ఉన్నట్లరుుతే సాయంత్రం కొంత అలస్యమైనా అందరి దరఖాస్తులు స్వీకరించిన తర్వాతే కౌంటర్‌ను మూసి వేయూలన్నారు. ఆధార్‌కార్డులు లేని దరఖాస్తు దారులకు ఆధార్ కార్డులను జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వికలాంగులు సదరం సర్టిఫికెట్లను జతపరిచి పింఛన్లకోసం దరఖాస్తు చేయలని, సర్టిఫికెట్లు లేనివారు జిల్లా ఆసుపత్రికి వెళ్లి తీసుకోవాలని సూచించారు.
విచారణకు సిద్ధం చేయూలి
ఇప్పటివరకు సేకరించిన దరఖాస్తులపై విచారణ చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయూలని కలెక్టర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఏరోజుకు సంబంధించిన దరఖాస్తులు ఆరోజు జాగ్రత్తగా కార్యాలయూనికి చేర్చాలన్నా రు. అనంతరం దరఖాస్తుల స్వీకరణ, ఇతర సమస్యలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్ వెంకన్న, ఏసీపీ ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు.