కేసీఆర్‌పై ఆరేపల్లి ఆగ్రహం | arepally mohan takes on cm kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌పై ఆరేపల్లి ఆగ్రహం

Jul 6 2017 7:31 PM | Updated on Aug 15 2018 9:40 PM

దళిత నేత బాబూ జగ్జీవన్‌రామ్‌ వర్ధంతిని అధికారంగా ఎందుకు నిర్వహించడం లేదని టీపీసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ ఆరేపల్లి మోహన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

సాక్షి, హైదరాబాద్‌: దళిత నేత బాబూ జగ్జీవన్‌రామ్‌ వర్ధంతిని అధికారంగా ఎందుకు నిర్వహించడం లేదని టీపీసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ ఆరేపల్లి మోహన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న దళిత నేతలు కూడా జగ్జీవన్‌రామ్‌కు నివాళులు అర్పించకపోవడం అవమానకరమన్నారు.

గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దళితనేతను కించపరిచేవిధంగా వ్యవహరించిన కేసీఆర్‌ దళిత వ్యతిరేకి అని మండిపడ్డారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు మూడెకరాల భూమిని ఇస్తామని చెప్పి మోసం చేశాడని ఆరోపించారు. ఓట్లకోసం కుయుక్తులు, మాయ మాటలు తప్ప దళితుల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement