మేనేజ్మెంట్ కోటా సీట్లు అన్నీ ఇతర రాష్ట్రాల వారికే! | All Management quota seats allotted to other states! | Sakshi
Sakshi News home page

మేనేజ్మెంట్ కోటా సీట్లు అన్నీ ఇతర రాష్ట్రాల వారికే!

Apr 19 2015 11:48 PM | Updated on Jul 18 2019 2:02 PM

ప్రైవేటు బీఈడీ కాలేజీల అక్రమాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది.

హైదరాబాద్: ప్రైవేటు బీఈడీ కాలేజీల అక్రమాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం 310 కాలేజీల్లో 200 కాలేజీల్లో మేనేజ్‌మెంటు కోటా సీట్లన్నిటినీ అత్యధికంగా బీహార్ రాష్ట్రానికి చెందిన విద్యార్ధులతో నింపేశారు. కొన్ని కాలేజీలు మణిపూర్, ఒడిస్సా, చత్తీస్‌ఘడ్‌కు చెందిన వారితో భర్తీచేశాయి. నిబంధనల పకారం మేనేజ్‌మెంటు కోటా సీట్లను కన్వీనర్ నిర్దేశించిన ఎడ్‌సెట్ ర్యాంకుల వారికి ఇవ్వాలి. ముందుగా రాష్ట్రానికి చెందిన విద్యార్ధులకు ప్రాధాన్యమివ్వాలి. వారు ముందుకు రాని పక్షంలో ప్రభుత్వ అనుమతి తీసుకొని ఇతర రాష్ట్రాల వారితో భర్తీచేయాలి. అన్ని రాష్ట్రాల వారికి తెలిసేలా ప్రముఖ పతికల్లో జాతీయస్థాయిలో ప్రకటనలు విడుదల చేయాలి.
కానీ కాలేజీలు పభుత్వంతో సంబంధం లేకుండా, ప్రకటనలు కూడా చేయకుండా బీహార్, మణిపూర్ విద్యార్ధులతో ఈ సీట్లను భర్తీ చేశాయి. ఈ కాలేజీలు అందించిన పత్రాల ఆధారంగా కాలేజీల్లోని ప్రవేశాలపై పూర్తిస్థాయి పరిశీలన చేసేందుకు నిపుణులతో ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఆయా కాలేజీల్లోని ప్రవేశాల తీరును పరిశీలించిన ఈ కమిటీ తన నివేదికను శనివారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాలరెడ్డికి అందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement