ఆర్టీసీ కార్మికులతో మరోసారి చర్చలు విఫలం

Again TSRTC Talks Fail,Strike Will Continue from Oct 5th  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ కార్మికుల చర్చలు మరోసారి విఫలం అయ్యాయి. వరుసగా మూడో రోజు కూడా అధికారుల కమిటీ, కార్మిక సంఘాల జేఏసీ మధ్య చర్చలు విఫలం కావటంతో సమ్మె కొనసాగనుంది. దీంతో శనివారం నుంచి సమ్మె యథాతథంగా కొనసాగనుందని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. ఎస్మాకు భయపడేది లేదని, ఆర్టీసీని బతికించడానికే తాము సమ్మె చేస్తున్నట్లు పేర్కొంది. ఎస్మా, పీడీ యాక్టులు తమకు కొత్తకాదని, ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందనటం తప్ప ఒక్క డిమాండ్‌కూ హామీ ఇవ్వటం లేదని కార్మిక సంఘాల నేతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆర్టీసీ జాక్‌ నేత అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మెకు అన్ని సంఘాలు కలిసి రావాలని కోరారు. డిపో మేనేజర్లు కూడా సమ్మెలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీని బతికించడానికే తాము సమ్మె చేస్తున్నామన్నారు. తాము ఎవరి చేతిలో కీలు బొమ‍్మలు కాదని, ప్రస్తుతం సకల జనుల సమ్మును మించిన సమ్మె అవసరమని అన్నారు. తమ సమ్మె ద్వారా ప్రజలకు కలిసి ఇబ్బందికి చింతిస్తున్నామని తెలిపారు. మరోవైపు సమ్మెల్లో పాల్గొనే వారిని ఉద్యోగాల నుంచి డిస్మిస్‌ చేస్తామని ఆర్టీసీ ఎండీ ఆదేశాలు జారీ చేశారు. 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top