దుర్గామాత నిమజ్జనంలో అపశ్రుతి | Accident in Immersion of Durga | Sakshi
Sakshi News home page

దుర్గామాత నిమజ్జనంలో అపశ్రుతి

Oct 24 2015 8:13 AM | Updated on Sep 29 2018 5:55 PM

దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు తీసుకెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి విద్యుత్ షాక్‌తో చనిపోయాడు.

దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు తీసుకెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి విద్యుత్ షాక్‌తో చనిపోయాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వెలిమినేడు గ్రామంలో శుక్రవారం అర్థరాత్రి ఈ అపశ్రుతి చోటుచేసుకుంది. దసరా సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించేందుకు ట్రాక్టర్‌ను సిద్ధం చేశారు. వెలుతురు కోసం అందులో ఉంచిన జనరేటర్‌కు ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రసారమైంది. ఈ విషయం తెలియని ఐతారం పెంటయ్య(30) అనే వ్యక్తి జనరేటర్‌ను తాకటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే చనిపోయాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement