ఏసీబీ వలలో అవినీతి ఆర్‌ఐ | ACB into the trap of corruption R.I | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో అవినీతి ఆర్‌ఐ

Nov 21 2014 3:19 AM | Updated on Aug 17 2018 12:56 PM

ఏసీబీ వలలో అవినీతి ఆర్‌ఐ - Sakshi

ఏసీబీ వలలో అవినీతి ఆర్‌ఐ

సాటి ఉద్యోగని చూడకుండా లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు ఇల్లంతకుంట ఆర్‌ఐ అపర్ణ.

ఇల్లంతకుంట : సాటి ఉద్యోగని చూడకుండా లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు ఇల్లంతకుంట ఆర్‌ఐ అపర్ణ.  రైతులకు సం బంధించిన భూ సమస్యలు చిన్నవైనా, పెద్దవైనా పరిష్కారానికి లంచం తీసుకోవడమే త న రూటుగా మార్చుకున్న ఆర్‌ఐ ఎట్టకేలకు అడ్డంగా బుక్కయ్యారు. ముస్కాన్‌పేట రెవెన్యూ సహాయకుడి నుంచి రూ.25 వేలు లం చం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వివరాల్లోకి వెళితే ఇల్లంతకుంట మండలం ముస్కాన్‌పేట గ్రామానికి చెందిన సీరవేని కనుకయ్య గ్రామ రెవెన్యూ సహాయకుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడి తండ్రికి చెందిన సర్వే నం బర్ 18, 126, 146, 147, 282, 284లోని 4.21 ఎకరాల వ్యవసాయ భూమిని తన పేరుమీద విరాసత్, పహణీలో నమోదు, పాస్‌పుస్తకాలు జారీ చేయాలని ఏడాది కాలం గా ఆర్‌ఐ అపర్ణ చుట్టు తిరుగుతున్నాడు.

‘పైసలిస్తేనే ఫైల్ కదుల్తది. లేకుంటే పని కాదు’ అని ఆర్‌ఐ తేల్చిచెప్పడంతో బాధితుడు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. విరాస త్ కోసం రూ.50 వేలు డిమాండ్ చేయగా తనతో అంత కాదని రూ.40 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. మొదటగా రూ.5 వేలు ముట్టజెప్పగా, మూడు నెలల క్రితం రూ.10 వేలు రెండు నెలల జీతం అప్పజెప్పాడు. మిగతా రూ.25 వేలు ఇస్తేనే పని పూర్తవుతుందని అపర్ణ చెప్పడంతో విసిగిపోయిన కనుకయ్య ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్‌ను ఆశ్రయించారు. మూడు రోజులుగా ఏసీబీ అధికారులు రెవెన్యూ కార్యాలయం వద్ద రెక్కీ నిర్వహించారు. గురువారం సాయంత్రం బాధితుడి నుంచి ఆర్‌ఐ రూ.25 వేలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. అపర్ణ తీసుకున్న రూ.25 వేలు, పాస్‌పుస్తకాలు, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.
 
ఎవర్నీ వదలం :ఏసీబీ డీఎస్పీ సుదర్శన్
లంచం కోసం ప్రజలను జలగల్లా పట్టిపీడిస్తున్న అవినీతి అధికారులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ అన్నారు. రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఆర్‌ఐ అపర్ణను శుక్రవారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఆర్‌ఐ అపర్ణతోపాటు కార్యాల యంలో పని చేసే సిబ్బంది, వీఆర్వోలపై ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. లంచం ఇస్తేనే పని చేస్తామనే అవినీతి అధికారుల వివరాలను 94404 46150, 94404 46139 నంబర్లకు ఫోన్ చేసి చెప్పాలని కోరారు. ఆయన వెంట సీఐలు వీరభద్రం, రమణమూర్తి, వేణుగోపాల్ ఉన్నారు.
 
పీడిస్తున్న వీఆర్వోలు...
ఆదాయం, కులం, పహణీలో పేరు మార్పు, ఆన్‌లైన్ నమోదు, పాస్‌పుస్తకాల జారీ, జమాబందీ అమలు, విరాసత్ వంటి పనులకు రైతులు వస్తే జేబులు నింపాకే ఫైలు కదులుతుందని వీఆర్వోలు కూడా రైతులను వేధిస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. 15 రోజుల క్రితం రైతులు బ్యాంకులో రుణా లు తీసుకునేందుకు పహణీ కోసం వీఆర్వోల వద్దకెళితే రూ.200 నుంచి రూ.400 వందల వరకు వసూలు చేశారని తెలిపారు.  వీఆర్వోలపై కూడా ఏసీబీ అధికారులకు పదుల సంఖ్యలో ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement