ఖమ్మం జిల్లా బోనకల్ మండలం లక్ష్మీపురం గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) లంచం తీసుకుంటూ సోమవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు.
బోనకల్ : ఖమ్మం జిల్లా బోనకల్ మండలం లక్ష్మీపురం గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) లంచం తీసుకుంటూ సోమవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. వివరాల ప్రకారం.. నర్ల వెంకట్రామమ్మ అనే మహిళా రైతుకు పట్టాదారు పాస్ పుసక్తం ఇచ్చేందుకు వీఆర్వో జి.వెంకన్న రూ.10 వేలు డిమాండ్ చేసినట్టు సమాచారం.
లోగడ రూ.6 వేలు తీసుకోగా... సోమవారం బాధిత రైతు నుంచి మరో రూ.4 వేలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సాయిబాబ ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రూ.4 వేలు స్వాధీనం చేసుకున్నారు.