ఏసీబీ డీఎస్పీ టి.సుదర్శన్‌గౌడ్ కథనం ప్రకారం.. తంగళ్లపల్లికి చెందిన పెద్ది ఎల్లయ్య అనే రైతుకు గ్రామంలోని సర్వేనంబర్ 726లో 2.05 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.
ఉద్యోగంలో చేరి నెలైనా కాకుండానే... కనీసం మొదటి నెల వేతనమైనా అందుకోకుండానే.. అవినీతి మకిలీ అంటించుకున్నాడో వీఆర్వో. కంప్యూటర్ పహణీలో పేరు నమోదు చేసేందుకు ఓ రైతు నుంచి రూ.2 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు తంగళ్లపల్లి వీఆర్వో గుర్రం రాజుగౌడ్.
కోహెడ : ఏసీబీ డీఎస్పీ టి.సుదర్శన్‌గౌడ్ కథనం ప్రకారం.. తంగళ్లపల్లికి చెందిన పెద్ది ఎల్లయ్య అనే రైతుకు గ్రామంలోని సర్వేనంబర్ 726లో 2.05 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉన్నాయి. 1బీ రిజిష్టర్‌లో కూడా నమోదై ఉంది. కంప్యూటర్ పహణీలో పేరు రాకపోవడంతో అందులో నమోదు కోసం ఎల్లయ్య పెద్దకొడుకు కుమార్ వీఆర్వో రాజుగౌడ్‌ను సంప్రదించాడు.
రూ.2 వేలు ఇస్తే నమోదు చేస్తానని వీఆర్వో చెప్పాడు. పహణీలో పేరు కోసం గతంలో రూ.500 తీసుకున్నాడని, ఇప్పుడు కంప్యూటర్ పహణీలో నమోదుకు మళ్లీ డబ్బులు అడగడంతో ఏసీబీని ఆశ్రయించాడు. వారు సూచన మేరకు శుక్రవారం గ్రామంలో వీఆర్వో రాజుకు కుమార్ డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అనంతరం విచారణ నిమిత్తం వీఆర్వోను తహశీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చారు. శనివారం ఏసీబీ కోర్టులో రిమాండ్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. దాడుల్లో సీఐ సతీశ్‌చందర్‌రావు, ఎస్సై రమణమూర్తి, శ్రీనివాస్‌రాజ్ ఉన్నారు. లంచం కోసం పీడిస్తున్నవారి భరతం పడతామని డీఎస్పీ తెలిపారు. లంచం అడిగేవారిపై తమకు ఫిర్యాదు చేయాలని లేదా 9440446150 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ్చఛిఛజుటఃజఝ్చజీ. ఛిౌఝకు సమాచారం అందించాలన్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు పొంది, 1బీలో ఉన్న రైతులకు సంబందించిన భూమి వివరాలు ఉచితంగా కంప్యూటర్ పహణీలో పొందుపరుస్తారని తెలిపారు.