కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని ఆంధ్రాబ్యాంక్ లో చోరీకి ఒక వ్యక్తి విఫల యత్నం చేశాడు.
కరీంనగర్: కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని ఆంధ్రాబ్యాంక్ లో చోరీకి ఒక వ్యక్తి విఫల యత్నం చేశాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఒక పథకం ప్రకారం అతడు బ్యాంకులోకి ప్రవేశించాడు. బ్యాంకులోకి ప్రవేశించగానే తనకు అడ్డొచ్చిన అటెండర్ వెంకటస్వామిపై కత్తితో దాడిచేశాడు. దీంతో వెంకటస్వామికి తీవ్రగాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమించడంతో బ్యాంకుకు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.