సౌదీలో కోర్టు కేసును ఎదుర్కొంటున్న నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలానికి చెందిన ఐదుగురు ఇంటికి రావాలంటే..
తాజాగా, సౌదీ ప్రభుత్వం అక్కడ అక్రమంగా ఉంటున్న వారు నేరుగా స్వగ్రామాలకు వెళ్లేందుకు అనువుగా క్షమాభిక్ష ప్రకటించింది. ఈ నెల 29న ఈ గడువు ముగుస్తుంది. ఏర్గట్లకు చెందిన ఐదుగురు సైతం స్వగ్రామాలకు వచ్చేందుకు అక్కడి మన విదేశాంగ శాఖ అధికారులను సంప్రదించారు. వారిపై సౌదీలో కేసులు నమోదై ఉన్నందుకు ఔట్ పాస్‌పోర్టులు జారీ చేయడం సాధ్యం కాదని, కేసుల విషయం తేల్చుకోవాలని సూచించారు. దీంతో కంపెనీ యాజమాన్యాన్ని సంప్రదించగా.. తమకు 70 వేల రియాళ్లు (మన కరెన్సీలో రూ. 15 లక్షల నుంచి రూ. 18 లక్షలు) జరి మానా చెల్లిస్తే.. పాస్‌పోస్టులు ఇస్తామని స్పష్టం చేసింది. కంపెనీలో సరిగా పనిలేకపోవడం వల్లే తాము బయటకు వచ్చామని కార్మికులు చెబుతున్నా.. వారి వాదనను వినేవారే లేకుండా పోయారు. ఈ క్రమంలో ప్రభుత్వం స్పందించి తమను స్వగ్రామానికి చేర్చాలని వారు కోరుతున్నారు.