రూ. 10 లక్షలు పలికిన ఫ్యాన్సీ నంబర్‌ | 9999 number fetches 10 lakhs in rta auction | Sakshi
Sakshi News home page

రూ. 10 లక్షలు పలికిన ఫ్యాన్సీ నంబర్‌

Apr 13 2017 8:15 PM | Updated on Sep 5 2017 8:41 AM

రూ. 10 లక్షలు పలికిన ఫ్యాన్సీ నంబర్‌

రూ. 10 లక్షలు పలికిన ఫ్యాన్సీ నంబర్‌

తెలంగాణ రవాణాశాఖ నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో కొన్ని నెంబర్లకు మంచి ధర పలికింది. అత్యధికంగా 9999 నెంబరుకు రూ. 10 లక్షలు పలికింది.

తెలంగాణ రవాణాశాఖ నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో కొన్ని నెంబర్లకు మంచి ధర పలికింది. అత్యధికంగా 9999 నెంబరుకు రూ. 10 లక్షలు పలికింది. టీఎస్‌ 09 ఈఎస్‌ 9999 నంబరును హెట్రో డ్రగ్స్‌ ప్రతినిధులు 10 లక్షలకు పాడుకున్నారు. రూ. 6.85 కోట్ల విలువైన బెంట్లీ ముల్సానే బ్రాండు కారుకు ఈ నెంబరు తీసుకున్నారు. ఇక ఆ తర్వాత టీఎస్‌ 09 ఈఎస్‌ 0099 నెంబరును రూ. 1.93 లక్షలకు సుశీ ఇన్‌ఫ్రా అండ్‌ మైనింగ్‌ లిమిటెడ్‌ వాళ్లు పాడుకున్నారు. రూ. 4.49 కోట్లతో కొన్న ఫెరారీ 488 జీటీబీ మోడల్‌కు ఈ నంబర్‌ పొందారు.

టీఎస్‌ 09 ఈఎస్‌ 0009 నంబరుకు రూ. 1.73 లక్షల ధర పలికింది. ఇంటర్‌ కాంటినెంటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంస్థ తాము రూ. 20 లక్షలతో తీసుకున్న ఇన్నోవా క్రిస్టా కారుకు ఈ నంబరు తీసుకుంది. ఇక టీఎస్‌ 09 ఈఎటీ 0007 నంబరును గాయత్రి ప్రాజెక్ట్స్ సంస్థ రూ. 1.15 లక్షలకు పాడుకుంది. రూ. 1.28 కోట్లతో కొన్న బెంజ్‌ ఎస్‌350 సీడీఐ కారుకు ఈ నంబరు పొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement