breaking news
Bently Mulsanne model
-
దేశంలో ఖరీదైన కారు ఈయన దగ్గరే.. ఇప్పుడు మరో కారు..
దేశంలో అత్యంత ఖరీదైన కార్లు ఉన్న వ్యాపారవేత్తల గురించి మాట్లాడేటప్పుడు ముఖేష్ అంబానీ, గౌతమ్ సింఘానియా, రతన్ టాటా వంటి పేర్లు మాత్రమే వినిపిస్తాయి. అయితే భారత్‌లో అత్యంత ఖరీదైన కారు వీఎస్ రెడ్డి అనే వ్యాపారవేత్త దగ్గర ఉంది.బెంట్లీ ముల్సానే ఈడబ్ల్యూబీ సెంటినరీ ఎడిషన్ దేశంలో అత్యంత ఖరీదైన కారు. దీని ధర రూ .14 కోట్లు. ముఖేష్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ సింఘానియా వంటివారి వద్ద ఉన్న రోల్స్ రాయిస్, ఫెరారీ కార్ల కంటే దీని ధర ఎక్కువ. దీని ఓనర్ వీఎస్ రెడ్డి ఇప్పుడు రూ .3.34 కోట్లు పెట్టి కొత్త మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 680 కారు కొన్నారు.మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 680.. మేబాచ్ ఎస్-క్లాస్ ప్రీమియం వెర్షన్. ఇందులో 6.0-లీటర్ టర్బోఛార్జ్డ్ వి12 ఇంజన్ ఉంది. ఇది 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్‌తో ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 610బీహెచ్పీ పవర్, 900ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.ఎవరీ వీస్ రెడ్డి అంటే..ప్రముఖ న్యూట్రాస్యూటికల్ కంపెనీల్లో ఒకటైన బ్రిటిష్ బయోలాజికల్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టరే వీఎస్ రెడ్డి. 'ది ప్రోటీన్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా పేరొందిన కర్ణాటకకు చెందిన వీఎస్ రెడ్డి పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. తాను ఆటోమోటివ్ ఔత్సాహికుడినని, దేశంలోని అన్ని బ్రాండ్ల కార్లు తన వద్ద ఉండాలనుకుంటానని ఈవీవో ఇండియా మ్యాగజైన్‌తో మాట్లాడుతున్న సందర్భంగా వీఎస్ రెడ్డి చెప్పారు. -
రూ. 10 లక్షలు పలికిన ఫ్యాన్సీ నంబర్
తెలంగాణ రవాణాశాఖ నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో కొన్ని నెంబర్లకు మంచి ధర పలికింది. అత్యధికంగా 9999 నెంబరుకు రూ. 10 లక్షలు పలికింది. టీఎస్ 09 ఈఎస్ 9999 నంబరును హెట్రో డ్రగ్స్ ప్రతినిధులు 10 లక్షలకు పాడుకున్నారు. రూ. 6.85 కోట్ల విలువైన బెంట్లీ ముల్సానే బ్రాండు కారుకు ఈ నెంబరు తీసుకున్నారు. ఇక ఆ తర్వాత టీఎస్ 09 ఈఎస్ 0099 నెంబరును రూ. 1.93 లక్షలకు సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ వాళ్లు పాడుకున్నారు. రూ. 4.49 కోట్లతో కొన్న ఫెరారీ 488 జీటీబీ మోడల్‌కు ఈ నంబర్ పొందారు. టీఎస్ 09 ఈఎస్ 0009 నంబరుకు రూ. 1.73 లక్షల ధర పలికింది. ఇంటర్ కాంటినెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ తాము రూ. 20 లక్షలతో తీసుకున్న ఇన్నోవా క్రిస్టా కారుకు ఈ నంబరు తీసుకుంది. ఇక టీఎస్ 09 ఈఎటీ 0007 నంబరును గాయత్రి ప్రాజెక్ట్స్ సంస్థ రూ. 1.15 లక్షలకు పాడుకుంది. రూ. 1.28 కోట్లతో కొన్న బెంజ్ ఎస్350 సీడీఐ కారుకు ఈ నంబరు పొందారు.