నగరంలో 81 బృందాలు ఏర్పాటు: సోమేశ్ | 81 teams formed to solve naala and drinage issue | Sakshi
Sakshi News home page

నగరంలో 81 బృందాలు ఏర్పాటు: సోమేశ్

Jun 14 2015 2:12 PM | Updated on Sep 3 2017 3:45 AM

నగరంలో 81 బృందాలు ఏర్పాటు: సోమేశ్

నగరంలో 81 బృందాలు ఏర్పాటు: సోమేశ్

వర్షాలతో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూసేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది.

హైదరాబాద్: వర్షాలతో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూసేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. నాలాలు, డ్రైనేజీల పూడికతీతతో పాటు వర్షం నీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకోనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్‌లో ఇందుకోసం 81 బృందాలను ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఇవి తమ పరిధిలో నాలాల పూడికతీత పనులను చేపడతాయని, ఈ పనుల నివేదికలను రోజువారీగా తనకు పంపించాలని ఆయన ఆదేశించారు. అదే విధంగా నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి, సంబంధిత బృందాల ఇన్‌ఛార్జిల ఫోన్ నంబర్లను పేర్లతో పాటు బోర్డులు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను సోమేశ్ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement