ఆగి ఉన్న వాహనాలను ఢీకొన్న బస్సు | 8 Members Injured in Bus Accident At Yadadri District | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న వాహనాలను ఢీకొన్న బస్సు

Dec 15 2019 1:32 AM | Updated on Dec 15 2019 1:32 AM

8 Members Injured in Bus Accident At Yadadri District - Sakshi

ప్రమాదంలో దెబ్బతిన్న కారు

చౌటుప్పల్‌(మునుగోడు): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం ఖైతాపురం గ్రామ స్టేజీ వద్ద శనివారం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వరుసగా 5 వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైతాపురం స్టేజీ వద్ద ఓ లారీ యూ టర్న్‌ తీసుకుంటున్నప్పుడు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు డ్రైవర్‌ బ్రేక్‌ వేసి తన కారును నిలిపాడు. వెనుకే ఉన్న మరో రెండు కార్ల డ్రైవర్లు సైతం బ్రేకులు వేశారు.

కార్ల వెనుకే వచ్చిన హైదరాబాద్‌ కుషాయిగూడ డిపోకు చెందిన లగ్జరీ బస్సు డ్రైవర్‌ సాయిలు బ్రేక్‌ వేశాడు. అయితే ఆ వెనుకే వచ్చిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డిపోకు చెందిన లగ్జరీ బస్సు డ్రైవర్‌ రామ్‌సింగ్‌ వాహనాలు ఆగిన విషయాన్ని గుర్తించకుండా వేగంగా వచ్చి ఢీకొట్టాడు. దీంతో వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సుల్లో ఉన్న 8 మంది గాయపడ్డారు. వారిలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనపై పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement