కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
కరీంనగర్: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యహ్న భోజనంలో బుధవారం గోంగూర పప్పు వడ్డించారు. తిన్న తర్వాత వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న ఆరుగురు విద్యార్థులను చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆహారం వికటించిందని మండల విద్యా శాఖ అధికారి రామ్మోహన్‌రావు ధ్రువీకరించారు.