యూరియా నీళ్లు తాగి ఐదు నెమళ్లు మృతి
పంట పొలంలో యూరియా కలిసిన నీళ్లు తాగి ఐదు నెమళ్లు మృతిచెందాయి.
	పరకాల (వరంగల్) : పంట పొలంలో యూరియా కలిసిన నీళ్లు తాగి ఐదు నెమళ్లు మృతిచెందాయి. ఈ సంఘటన వరంగల్ జిల్లా పరకాల మండలం అలియాబాద్ గ్రామ శివారులో సోమవారం వెలుగుచూసింది. పంట పొలాల వద్దకు వెళ్లిన రైతులు ఇది గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు.
	
	దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు రసాయనాలు కలిసిన నీళ్లు తాగడం వల్లే చనిపోయి ఉంటాయిని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
