కోడిపందాలు నిర్వహిస్తున్న 49 మంది అరెస్టు | 49 persons arrested due to cock fight bettings | Sakshi
Sakshi News home page

కోడిపందాలు నిర్వహిస్తున్న 49 మంది అరెస్టు

Feb 15 2015 9:31 PM | Updated on Sep 2 2017 9:23 PM

కోడి పందాల స్థావరంపై పోలీసులు దాడిచేసి 49 మందిని అరెస్టు చేశారు.

గట్టు: కోడి పందాల స్థావరంపై పోలీసులు దాడిచేసి 49 మందిని అరెస్టు చేశారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా గట్టు మండలంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గట్టు మండలం చాగదూల శివారులో కోడి పందాలు నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. హుటాహుటిన పోలీసులు అక్కడకు చేరుకుని పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. 49 మందిని అరెస్టు చేయడంతో పాటు రూ.10 వేలు నగధు, 9 బైక్ లు, 20 సెల్ఫోన్లు, 9 కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement