వచ్చే ఏడాది నుంచి నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు | 4 years degree course from next year | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాది నుంచి నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు

Oct 1 2014 2:17 AM | Updated on Sep 2 2017 2:11 PM

‘ఇకపై నాలుగేళ్ల బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీలతోనే ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలు అందుబాట్లోకి రానున్నాయి’ అని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి తెలిపారు.

 సాక్షి, హైదరాబాద్: ‘ఇకపై నాలుగేళ్ల బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీలతోనే ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలు అందుబాట్లోకి రానున్నాయి’ అని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి తెలిపారు. మైనార్టీ అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన బీఎడ్ కౌన్సెలింగ్ ప్రక్రియను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని, ఇటీవల వివిధ వర్సిటీల వీసీలతో జరిగిన సమావేశంలో నిర్ణయించామన్నారు. బీఈడీ, ఎంఈడీ కోర్సుల వ్యవధిని కూడా రెండేళ్లకు పెంచనున్నట్లు వేణుగోపాలరెడ్డి చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement