గిరిజన బాలికను రాజస్థాన్‌లో విక్రయించిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
ఆదిలాబాద్ జిల్లా కెరిమెరి మండలం నాగల్‌గొందికి చెందిన గిరిజన బాలికను రాజస్థాన్‌లో విక్రయించిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. బాలిక బంధువైన బాయక్క, వాంకిడి మండలానికి చెందిన మధ్యవర్తులు నాందేవ్, భీమేష్, అర్జున్‌లతో కలిసి రాజస్థాన్‌కు చెందిన హరిశంకర్‌తో లక్షా 5వేలకు బేరం కుదర్చుకుంది. బాలికను మాయమాటలతో నమ్మించి రాజస్థాన్‌కు పంపించింది.
విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజస్థాన్ వెళ్లి బాలికను తీసుకొచ్చారు. బాలికను విచారించిన తర్వాత బాయక్కతో పాటు మధ్యవర్తుల్ని అరెస్టు చేశారు.