పెళ్లింట పెనువిషాదం | 35 people were injured in accident | Sakshi
Sakshi News home page

పెళ్లింట పెనువిషాదం

Dec 13 2014 3:57 AM | Updated on Aug 30 2018 3:58 PM

పెళ్లింట పెనువిషాదం - Sakshi

పెళ్లింట పెనువిషాదం

వైరా మండలం పినపాక వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.

ఇద్దరి దుర్మరణం - 35 మందికి గాయాలు
ఐదుగురి పరిస్థితి ఆందోళనకరం


వైరా/తల్లాడ  : వైరా మండలం పినపాక వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరో 35మందికి గాయాలయ్యాయి. స్థానికు లు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వైరాలోని బ్రాహ్మణపల్లికి చెందిన ఆది శ్రీకాంత్‌కు తల్లాడ మండలం మంగాపురం గ్రామానికి చెందిన లక్ష్మీపార్వతితో శుక్రవారం రాత్రి 11.30గంటలకు వివాహం జరగాల్సి ఉంది. దీంతో మంగాపురం నుంచి ట్రాక్టర్‌లో పెళ్లి కుమార్తె బంధువులు, గ్రామస్తులు బయల్దేరారు. వైరా మండలం పినపాక హైలెవల్ వంతెన వద్దకు రాగానే ట్రాక్టర్ ట్రక్కును వైరా నుంచి తల్లాడ వైపు వెళ్తున్న లారీ ఢీకొంది.

దీంతో ట్రాక్టర్‌లో ఉన్న పెళ్లి బృందం బ్రిడ్జి కింద లోయలో పడిపోయింది. ఈ ఘటనలో వధువు మేనత్త గాదె లీలావతి(40), గాదె రమాదేవి(35) మృతిచెందారు. ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న పద్మ, టి.రమాదేవి, వి.లక్ష్మీనరసమ్మ, కె.సుబ్బారావు, పి.అప్పారావు, వెంకమ్మ, పరుచూరి పద్మ, పరుచూరి సామ్రాజ్యం సహా 35మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.  కాగా ట్రాక్టర్ వెనుక ద్విచక్రవాహనంపై అదే పెళ్లికి హాజరయ్యేం దుకు వస్తున్న వి.రాంబాబు(35) ట్రాక్టర్‌ను ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement