సాంబార్‌ డేక్షాలో పడి చిన్నారి మృతి.!

3 Year Old Baby Died in Kamareddy - Sakshi

సాక్షి, కామారెడ్డి: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గురుకుల పాఠశాలలో మూడున్నరేళ్ల చిన్నారి సాంబార్‌ డేక్షాలో పడి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పిట్లం మండలం బీసీ గురుకుల పాఠశాలలో శోభ, యాదులు అనే దంపతులు వంట మనుషులుగా పనిచేస్తున్నారు. వీరికి కీర్తన అనే మూడున్నరేళ్ల కూతురు ఉంది. కుటుంబమంతా ఆ వంట గదిలోనే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. 

రోజూ మాదిరిగానే ఈ రోజు(శనివారం) విద్యార్థులకు వంటలు సిద్దం చేశారు. వంటలో భాగంగా సాంబర్‌ చేసి డేక్షాను పక్కన పెట్టారు. అంతలో అక్కడికి ఆడుకుంటూ వచ్చిన కీర్తన అకస్మాత్తుగా ఆ సాంబార్‌ వండిన డేక్షా(గిన్నె, బగోనే) లో పడి పోయింది. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం పిట్లం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి చివరకు ప్రాణాలు వదిలింది. కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top