15 ఏళ్ల తల్లిదండ్రుల నివాసమే ‘స్థానికత’ | 15-year-old parent's residence is 'local' | Sakshi
Sakshi News home page

15 ఏళ్ల తల్లిదండ్రుల నివాసమే ‘స్థానికత’

Jun 30 2017 2:18 AM | Updated on Sep 5 2017 2:46 PM

15 ఏళ్ల తల్లిదండ్రుల నివాసమే ‘స్థానికత’

15 ఏళ్ల తల్లిదండ్రుల నివాసమే ‘స్థానికత’

రాష్ట్రంలో కొత్తగా చేపట్టే నియామకాలకు స్థానికతను పునర్‌ నిర్వ చించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేశాయి.

► కొత్త నియామకాలకు స్థానికతను పునర్‌ నిర్వచించాలి
► ఉద్యోగ సంఘాల డిమాండ్‌


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా చేపట్టే నియామకాలకు స్థానికతను పునర్‌ నిర్వ చించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేశాయి. 4 నుంచి 10వ తరగతిలో నాలు గేళ్లు ఎక్కడ ఉంటే అక్కడే స్థానికులుగా గుర్తిస్తున్న ప్రస్తుత విధానాన్ని మార్పు చేయాలన్నాయి. 15 ఏళ్ల పాటు తల్లిదండ్రు లు నివాసమున్న ప్రాంతంలోనే స్థానికులు గా గుర్తించాలని పేర్కొన్నాయి. గురువారం తెలంగాణ గెజిటెట్‌ అధికారుల సంఘం (టీజీవో) కార్యాలయంలో ఉద్యోగ సంఘా ల రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. జోనల్‌ వ్యవస్థ రద్దు, రాష్ట్ర, జిల్లా కేడర్‌లపై ఈ సందర్భంగా చర్చ జరిగింది.

టీజీవో చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. కొత్త విధానాన్ని భవిష్యత్తులో చేపట్టే నియామకాల్లోనే వర్తింపజేయాలని.. ఇప్పటికే నియమితులైన ఉద్యోగులకు భవిష్యత్తులో సీనియారిటీ, బదిలీల్లో ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. టీజీవో అధ్యక్షురాలు మమత మాట్లా డుతూ.. యువతకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టా లన్నారు. రాష్ట్ర కేడర్‌లో స్థానిక రిజర్వేషన్‌ కోటా 85 శాతం, రాష్ట్ర రిజర్వేషన్‌ కోటా 15 శాతం ఉండాలన్నారు. ప్రస్తుత ఉద్యోగుల కు కొత్త విధానాలు ఎలా వర్తింపజేస్తారని ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం అ«ధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి ప్రశ్నించారు

. వీటిపై రాత్రికిరాత్రే నిర్ణయం తీసుకో కుండా, నిఫుణుల కమిటీ అధ్యయనం చేయించాలన్నారు. గ్రూప్‌–1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్‌ మాట్లా డుతూ.. గ్రూప్‌–1లోని జోనల్‌ పోస్టులను రాష్ట్ర పోస్టులుగా మార్పు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతిభగల, వెనుకబడిన వర్గాల వారికి గ్రూప్‌–1, గ్రూప్‌–2 పోస్టుల భర్తీకి వార్షిక విధానం ఉండాలన్నారు. సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పద్మాచారి, శివశంకర్, లాలూ ప్రసాద్, చక్రధర్‌ పాల్గొన్నారు.

అధ్యయనానికి గడువివ్వండి
రెండంచెల జోన్ల విధానంపై మరింత లోతుగా చర్చించేందుకు సమయం ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశం అనంతరం సచివాలయంలో సీఎస్‌ను కలసి వినతిపత్రం అందజేశారు.

‘మోడల్‌’టీచర్లకు బకాయిలు విడుదల
రాష్ట్రంలోని మోడల్‌ స్కూల్‌ టీచర్లకు అన్ని రకాల బకాయిలు విడుదల చేస్తూ పాఠ«శాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీచేసింది. 2013 జూలై 1 నుంచి 2017 మార్చి 31 వరకు రావాల్సిన డీఏ, 2014 జనవరి 1 నుంచి జూన్‌ 1 వరకు రావాల్సిన ఐఆర్‌ బకాయిలను మంజూరు చేసింది. 2014 జూన్‌ 2 నుంచి 2015 ఫిబ్రవరి 28 వరకు రావాల్సిన పీఆర్‌సీ బకాయిలను 18 భాగాలుగా ఇతర ఉద్యోగులకు ఇచ్చే విధంగానే నెలనెలా వేతంనంతో ఇచ్చేలా ఉత్తర్వులు జారీచేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement