గిరిజన డిగ్రీ కాలేజీల్లో 1,455 పోస్టులు

1,455 posts in tribal degree colleges

మంజూరు చేసిన ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌ :  ఈ ఏడాది కొత్తగా ఏర్పాటైన 22 గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌  డిగ్రీ కాలేజీలకు టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయంలో వివిధ కేటగిరీలతోపాటు ప్రాంతీయ సమన్వయకర్తల పోస్టులను సైతం మంజూరు చేసింది.

మొత్తం 1,455 పోస్టుల మంజూరుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. పోస్టులు భర్తీ చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖకు సూచించింది. వీటిలో డిగ్రీ కాలేజీలకు సంబంధించి బోధన, బోధనేతర సిబ్బంది కింద 1,430 పోస్టులు, కార్యదర్శి కార్యాలయానికి 25 పోస్టులను కేటాయించింది. వీటిలో అత్యధికంగా 880 డిగ్రీ లెక్చరర్‌ పోస్టులున్నాయి. గురువారం ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఎన్‌.శివశంకర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  

మంజూరైన పోస్టులివే..
విభాగం: టీటీడబ్ల్యూ డిగ్రీ కాలేజీ

పోస్టు కేటగిరీ             పోస్టులు
ప్రిన్సిపాల్‌                        22
డిగ్రీ లెక్చరర్‌                   880
లైబ్రేరియన్‌                      22
ఫిజికల్‌ డైరెక్టర్‌                  22
పరిపాలనాధికారి                22
సూపరింటెండెంట్‌               22
మెస్‌ మేనేజర్‌/వార్డెన్‌          22
స్టాఫ్‌ నర్స్‌                       44
సీనియర్‌ అసిస్టెంట్‌            22
కేర్‌ టేకర్‌                         22
ల్యాబ్‌ అసిస్టెంట్‌                88
కంప్యూటర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌    44
అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌        22
జూనియర్‌ అసిస్టెంట్‌/డీఈఓ    22
స్టోర్‌ కీపర్‌                     22
మ్యూజియం కీపర్‌           22
రికార్డ్‌ అసిస్టెంట్‌              22
ఆఫీస్‌ సబార్డినేట్‌            88

విభాగం: కార్యదర్శి కార్యాలయం
రిజిస్ట్రార్‌                       1
డిప్యూటీ సెక్రెటరీ             2
అసిస్టెంట్‌ సెక్రెటరీ            2
సూపరింటెండెంట్‌            3
సీనియర్‌ అసిస్టెంట్‌          3
జూనియర్‌ అసిస్టెంట్‌         3
ఆఫీస్‌ సబార్డినేట్‌            3
రీజినల్‌ కోఆర్డినేటర్‌         8

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top