రోడ్డుప్రమాదంలో బాలిక మృతి | 12 years old girl dies in Road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో బాలిక మృతి

Jan 19 2016 3:15 PM | Updated on Aug 30 2018 3:58 PM

మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక మృతి చెందింది.

నారాయణపేట రూరల్ : మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక మృతి చెందింది. నారాయణపేటలో మేస్త్రీ పని చేసే వెంకటేశ్వర్లు సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబసభ్యులతో కలసి స్వస్థలమైన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు వెళ్లాడు.

పండుగ అనంతరం తిరిగి నారాయణపేటకు కారులో బయల్దేరారు. నారాయణపేట మండలం చిన్నజగ్గం సమీపంలో అడవి పంది అడ్డురాగా కారు ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న వెంకటేశ్వర్లు పెద్ద కుమార్తె అర్చిత (12) తీవ్రంగా గాయపడి మృతి చెందింది. చిన్న కుమార్తె హరిత (7)కు స్వల్ప గాయాలు అయ్యాయి, వెంకటేశ్వర్లు, ఆయన భార్య, కారు డ్రైవర్ సురక్షితంగా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement