కొడుకులు కొట్టిన కేసులో రూ.10 లక్షలకు సెటిల్మెంట్ | 10lakhs settlement on son and father case | Sakshi
Sakshi News home page

కొడుకులు కొట్టిన కేసులో రూ.10 లక్షలకు సెటిల్మెంట్

Sep 14 2016 2:49 AM | Updated on Sep 2 2018 4:37 PM

కొడుకులు కొట్టారని.. కోర్టుకెక్కిన తండ్రి! శీర్షికన మంగళవారం ‘సాక్షి’ మెరుున్ ఎడిషన్ లో కథనం ప్రచురితమవడంతో బాధితుడి కుమారులు

కాశిబుగ్గ(వరంగల్): కొడుకులు కొట్టారని.. కోర్టుకెక్కిన తండ్రి! శీర్షికన మంగళవారం ‘సాక్షి’ మెరుున్  ఎడిషన్ లో కథనం ప్రచురితమవడంతో బాధితుడి కుమారులు వాస్తవ పరిస్థితిని వివరిస్తూ స్థానిక మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్లో తండ్రి పోషాల రమేశ్ మీద ఫిర్యాదు చేశారు. గతంలోనూ బ్లాక్ మెరుుల్ చేసి, డబ్బు వసూలు చేశాడని, తమకు  ఎలాంటి ఆస్తి సంపాదించి ఇవ్వలేదని తెలిపారు. గతంలోనూ తమ ను డబ్బుకు ఇబ్బందిపెట్టి కోర్టుకు వెళ్లాడని చెప్పారు.

ఆయన వివాహేతర సంబంధం పెట్టుకుని తమను, తమ తల్లిని వేధిస్తున్నాడని,  ఉన్న కొద్ది ఆస్తిని రెండో భార్య పేరున రాశాడని వివరించారు. 2 నెలలుగా తమ టెంట్‌హౌస్‌లో తిష్టవేసి  తమను షాపులోకి రానివ్వకుండా, రూ.20 లక్షలివ్వాలని డిమాండ్ చేస్తున్నాడని, తామందుకు నిరాకరించడంతో తమపైనే రాడ్‌తో దాడి చేశాడని, ఆ రాడ్‌తోనే తానూ కొట్టుకుని కోర్టుకు వెళ్లాడని ఆరోపించారు. కాగా పెద్ద మనుషుల సమక్షంలో రూ.10 లక్షలిస్తే తమ జోలికి రానని చెప్పాడని, ఈ అవమానాలను భరించలేక అందుకు కూడా ఒప్పుకున్నామని వారు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement