జాతీయ అంబులెన్స్ సేవా పథకంలోకి 108 | 108 of the National Ambulance Service Scheme | Sakshi
Sakshi News home page

జాతీయ అంబులెన్స్ సేవా పథకంలోకి 108

Nov 29 2014 12:43 AM | Updated on Aug 20 2018 9:16 PM

జాతీయ అంబులెన్స్ సేవా పథకంలోకి 108 - Sakshi

జాతీయ అంబులెన్స్ సేవా పథకంలోకి 108

జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తున్న జాతీయ అంబులెన్స్ సేవాపథకంలోకి....

సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తున్న జాతీయ అంబులెన్స్ సేవాపథకంలోకి 108-ఈఎంఆర్‌ఐ (ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) పథకాన్ని మారుస్తూ టీ సర్కార్ శుక్రవారం ఉత్తర్వులు (జీవో నం. 38) జారీచేసింది. కేంద్రం సంచార మెడికల్ యూనిట్స్, అంబులెన్స్ సర్వీసులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకు రానుంది. జాతీయ అంబులెన్స్ సేవా పథకంలోకి మారడం వల్ల అంబులెన్సుల నిర్వహణకయ్యే ఖర్చులో 25 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ నేపథ్యంలో 108-ఈఎంఆర్‌ఐ పథకాన్ని జాతీయ అంబులెన్స్ సేవా పథకంలోకి మారుస్తున్నట్లు ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement