రీంనగర్ జిల్లా వేములవాడ సమీపంలోని ఆరపల్లి వద్ద ఆటోను లారీ ఢీ కొన్న సంఘటనలో ఒక కుటుంబం మొత్తం దుర్మరణం పాలైంది.
ఆటోను ఢీకొన్న లారీ, కుటుంబం మొత్తం దుర్మరణం
వేములవాడ, కరీంనగర్ జిల్లా వేములవాడ సమీపంలోని ఆరపల్లి వద్ద ఆటోను లారీ ఢీ కొన్న సంఘటనలో ఒక కుటుంబం మొత్తం దుర్మరణం పాలైంది. ఈ ఘటనలో మొత్తం 10మంది మత్యువాత పడ్డారు. కుమారుడి పెళ్లిచేసి ఆనందంగా వరంగల్ జిల్లా నుంచి కరీంనగర్ జిల్లా వేములవాడ రాజన్న మొక్కు చెల్లించేందుకు వీరు బయలుదేరి కానరాని లోకాలకు వెళ్లారు. వివరాలు.. వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలం ఒంటిమామిడిపల్లికి చెందిన కడుదూరి కొమరమల్లు కుమారుడు రమేశ్‌కు 20రోజుల క్రితం అదే జిల్లా జాఫర్‌గడ్డ మండలం తీగారానికి చెందిన అనితతో వివాహమైంది.
నూతన దంపతులతో కలిసి తమ ఇంటి ఇలవేల్పయిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి దర్శించుకునేం దుకు కుటుంబసమేతంగా ఆటోలో బయల్దేరారు. వేములవాడ మండలం ఆరెపెల్లి వద్దకు చేరగానే తమ ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో ఎదురుగా వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న కొమరమల్లు (60), కాశమ్మ (56), రమేశ్ (26), అనిత (22), హైమ (35), సింధూజ (19), రాణి (28), వేద సంజయ్‌కుమార్ (35), రెండేళ్ల వయస్సున్న ఇద్దరు కవల పిల్లలు మనోజ్, మనస్వితలు చనిపోయారు.