మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం ముమ్మళ్లపల్లి సమీపంలోజరిగిన ప్రమాదంలో ఒకరు చని పోయారు.
కొత్తకోట: మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం ముమ్మళ్లపల్లి సమీపంలోజరిగిన ప్రమాదంలో ఒకరు చని పోయారు. 44వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న బైక్‌ను వేగంగా వచ్చిన లారీ ఢీకొని వెంకన్న(30)అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.