బాలుడి కిడ్నాప్ కేసులో నిందితుడి అరెస్ట్ | 1 arrested over secunderabad bay kidnap | Sakshi
Sakshi News home page

బాలుడి కిడ్నాప్ కేసులో నిందితుడి అరెస్ట్

Nov 4 2015 1:37 PM | Updated on Sep 3 2017 12:00 PM

నగరంలో కలకలం సృష్టించిన బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు.

సికింద్రాబాద్: నగరంలో కలకలం సృష్టించిన బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాప్‌కు పాల్పడిన నిందితుడు వీరాచారిని బుధవారం అరెస్ట్ చేశారు. వివరాలు.. సికింద్రాబాద్ జనరల్ బజార్‌లో మంగళవారం 14 నెలల బాలుడు పృథ్వి కిడ్నాప్‌కు గురయ్యాడు. ఈ విషయం పై కేసు నమోదు చేసుకున్న మహంకాళి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి ఈ రోజు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా.. బాలుడి దూరపు బంధువు బాలాచారే ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు అతన్ని విచారించగా రూ. 5 వేలకు బాబును అమ్మేసినట్లు తెలిపాడు. బాబు మెడలో ఉన్న బంగారు గొలుసును కూడా అమ్ముకున్నట్లు చెప్పాడు. మరింత సమాచారం కోసం పోలీసులు విచారణ చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement