వీరికి 'రాజా ది గ్రేట్‌' ఫ్రీ.. ప్రీమియర్‌ షో | ‘Raja the great’ Movie special show for handicapped people | Sakshi
Sakshi News home page

దివ్యాంగులకు ‘రాజా ది గ్రేట్‌’ 

Oct 29 2017 1:39 AM | Updated on Oct 29 2017 1:55 AM

‘Raja the great’ Movie special show for handicapped people

సాక్షి, హైదరాబాద్‌: దివ్యాంగుల సంక్షేమ శాఖ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ శాఖ పరిధిలోని సదనాలు, వసతిగృహాల్లో ఉంటున్న దివ్యాంగులకు ఇటీవల విడుదలైన ‘రాజా ది గ్రేట్‌’ తెలుగు సినిమా ప్రీమియర్‌ షో ఏర్పాటు చేసింది. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సుదర్శన్‌ 35ఎంఎం సినిమాహాలులో ఆదివారం ఉదయం 11 గంటలకు సినిమాను ప్రదర్శించనున్నారు.

దివ్యాంగుడి నేపథ్యంతో సాగే ఈ సినిమాలో హీరో విజయం సాధించిన తీరును వివరించేందుకు షోను ఏర్పాటు చేసినట్లు దివ్యాంగుల సంక్షేమ శాఖ కమిషనర్‌ బి.శైలజ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రీమియర్‌ షో అనంతరం హీరో రవితేజతో దివ్యాంగ పిల్లల ముఖాముఖి కార్యక్రమం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement