షియోమి ఫోన్‌లకు జియో సూపర్‌ ఆఫర్‌ | reliance jio new offer to xiaomi phones | Sakshi
Sakshi News home page

షియోమి ఫోన్‌లకు జియో సూపర్‌ ఆఫర్‌

Jun 29 2017 8:20 PM | Updated on Sep 5 2017 2:46 PM

షియోమి ఫోన్‌లకు జియో సూపర్‌ ఆఫర్‌

షియోమి ఫోన్‌లకు జియో సూపర్‌ ఆఫర్‌

రిలయన్స్‌ జియో షియోమి వినియోగదారులకు సూపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.

న్యూఢిల్లీ: షియోమి ఫోన్‌ వినియోగదారులకు శుభవార్త. రిలయన్స్‌ జియో షియోమి వినియోగదారులకు సూపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. షియోమి ఫోన్‌లో జియో సిమ్‌ ఉపయోగిస్తున్నట్లయితే ఈ కొత్త ఆఫర్‌ మీసొంతం. గతంలో నోకియా స్మార్ట్‌ఫోన్‌లకు ప్రత్యేక మొబైల్‌ డేటా ప్యాక్‌ అందిచిన జియో తాజాగా షియోమి వినియోగదారులకు అదే తరహాలో డేటా ప్యాక్‌ను అందించబోతోంది.

షియోమి ఫోన్‌లో జియో సిమ్‌ వాడుతూ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ఉన్న వినియోగదారులకు 30జీబీ అదనపు డేటాను ఇవ్వనుంది. రూ.309తో రీచార్జ్‌ చేసుకున్నప్పుడు అదనంగా 5జీబీ అందిస్తుంది. ఇలా ఆరు సార్లు ఇస్తుంది. ఈ అదనపు డేటా తదుపరి నెలకు పొడిగించబదు. ఆ నెలలోనే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
ఆఫర్‌కు అర్హమైన షియోమి ఫోన్‌ల జాబితా
► రెడ్‌ మి 2 , ► రెడ్‌ మి  2, ►  ప్రైమ్‌ రెడ్‌ మి 3, ► రెడ్‌ మి 3ఎస్‌, ► రెడ్‌ మి 3ఎస్‌ ప్లస్‌, ► రెడ్‌ మి 3ఎస్‌ ప్రైమ్‌, ► రెడ్‌ మి 4, ► రెడ్‌ మి 4ఏ, ► రెడ్‌ మి నోట్‌ 3, ► రెడ్‌ మి నోట్‌ 4, ► రెడ్‌ మి నోట్‌ 4జి, ► రెడ్‌ మి నోట్‌ 4జి ప్రైమ్‌, ► ఎమ్‌ఐ 4ఐ, ► ఎమ్‌ఐ 5, ► ఎమ్‌ఐ మాక్స్‌, ► ఎమ్‌ఐ మాక్స్‌ ప్రైమ్‌

Advertisement
 
Advertisement
Advertisement